పోలీసింగ్‌లో కృత్రిమ మేధ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు వీలుగా ‘ఏఐ4 ఏపీ పోలీస్’ పేరిట రాష్ట్రంలోని చిత్తూరు, గుంటూరు, అన్నమయ్య జిల్లాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టుల అమలును డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా బుధవారం ప్రారంభించారు. 8 రకాల ఏఐ టూల్స్ ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారం, డిజిటల్ సాక్ష్యాల విశ్లేషణ, ఆధార సహిత దర్యాప్తు, దర్యాప్తు అధికారికి సాంకేతిక సహకారం, సామాజిక మాధ్యమాలపై నిఘా తదితర అంశాలకూ ఉపయోగపడనున్నాయి.

