తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతమంది అహంకారంతో వ్యవహరిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సినీ పెద్దలు తమను కలవలేదని ఎప్పుడూ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదన్నారు. మాకు ఎవరి సహకారం అవసరం లేదు మేమే చూసుకుంటాం అనే మాటలు ఎవరి ప్రోద్బలంతో ఆ మాట అన్నారో నాకు తెలీదు.ప్రస్తుతానికి బంద్ నిర్ణయం వెనక్కు తీసుకున్నందున ఈ సమస్య సమసిపోయినట్లేనని మంత్రి దుర్గేష్ అన్నారు.

