
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)నిర్వహించిన మార్చ్‌లో పాల్గొన్న అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. కర్నాటకలోని రాయ్‌చూర్ జిల్లాలోగల సిర్వార్ తాలూకాలో ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న కేపీ ప్రవీణ్ కుమార్‌ను గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ (ఆర్డీపీఆర్) విభాగం సస్పెండ్ చేసింది. ఆయన లింగ్సుగూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది రూట్ మార్చ్‌లో ఆ సంస్థ యూనిఫారం ధరించి పాల్గొన్నారు. ఫలితంగా ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు.