బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరుచేయడంతో ఆయన బయటకొచ్చారు.