ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును కూడా మార్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నయి. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సైతం ఇదే డిమాండ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును కూడా ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగా తెలుగునాడు అని మార్చాలి. అప్పుడే మనకు జాతీయాభిమానం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదు. కేరళ వాళ్లకు ఉన్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకు లేదు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరే కాదు మన బతుకులు కూడా మారతాయి’’ అని గరికపాటి వ్యాఖ్యానించారు.

