కృత్రిమ మేధ స్టార్టప్ ఆంథ్రోపిక్ వరుస సంచలనాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు వణుకు పుట్టిస్తోంది. తాజాగా సైబర్ సెక్యూరిటీ సర్వీస్లు అందించే కంపెనీలకు షాకిచ్చింది. కొన్ని గంటల క్రితం ఆంథ్రోపిక్ చేసిన ఒక్క పోస్ట్ పది బిలియన్ డాలర్ల నష్టాన్ని మోసుకొచ్చింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లో సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు కుప్పకూలాయి. సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్ ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ తీసుకొస్తున్నట్టు ఆంథ్రోపిక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

