తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ అధికార నాయకత్వంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్‌గా హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను ప్రకటించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఉప నేతలుగా ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్ వ్యవహరించనున్నారు. మధుసూదనాచారీని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగించారు.

