దక్షిణ ఇరాన్ లో మినాబ్ నగరంలోని భూమి 165 చిన్నారుల సమాధుల తవ్వకాలకు సిద్ధమవుతోంది. ఇందులో 160 కి పైగా విద్యార్థినుల మృతదేహాలు ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ప్రాథమిక పాఠశాల బలైపోవడం తీరని విషాదం. ఈ సామూహిక సమాధులను తవ్వుతున్న దృశ్యాలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌అరాగ్చీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి మొదట్లో చెప్పినప్పటికీ, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్( ఐఆర్‌జిసి ) ఈ దాడికి బాధ్యులై ఉండవచ్చని ఇజ్రాయెల్ పేర్కొంది.

