అమెరికాలోని న్యూ బ్రున్స్విక్ నగరం ఏఐ డాటా సెంటర్ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. సహజ వనరులను యథేచ్ఛగా తోడివేసే ఈ సెంటర్లకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వాటితో ఎంతో ప్రమాదం ఉన్నప్పటికీ.. మన దేశం ఏఐ డాటా సెంటర్ల కోసం వెంపర్లాడుతున్నది. ఇదే అదనుగా గూగుల్ వంటి కంపెనీలు భారత్లో డాటా సెంటర్ల ఏర్పాటకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఆ కంపెనీల ప్రధాన కేంద్రమైన అమెరికాలో మాత్రం ప్రజానీకం తలుపులు మూసేస్తున్నారు.

