
రాజధాని అమరావతిలో సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి ఫ్లోర్లోకి వెళ్లి పరిశీలించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ అనే కొత్త విధానాన్ని తెచ్చాం. సమీకరణ విధానాన్ని సక్సెస్ చేసిన చరిత్ర అమరావతి రైతులదే’,త్వరలో అమరావతి రైతులతో ప్రత్యేకంగా సమావేశం అవుతాను. అమరావతి రైతులను మరిచేదే లేదు… అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు.