హాలీవుడ్ డైరెక్టర్ రాబ్ రీనర్ (78), ఆయన సతీమణి మిచెల్ సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. లాస్ ఏంజెలెస్‌లోని తమ నివాసంలో వారి శరీరాలపై కత్తిగాయాలతో మృతదేహాలు కనిపించాయి. ప్రస్తుతం పోలీసులు దీనిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాబ్ రీనర్ ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో సేవలందించారు. ఆయన ‘స్టాండ్ బై మీ’, ‘ది ప్రిన్సెస్ బ్రైడ్’, ‘వెన్ హ్యారీ మెట్ సాలీ’ తదితర సినిమాలకు దర్శకత్వం వహించారు.

