ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఒక అడల్ట్ వెబ్సైట్లో తనతో పాటు ఇతర మహిళల ఫొటోలను మార్పింగ్ చేసి ఉంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనను అసహ్యకరమైనది అని అభివర్ణించారు. నేరస్థులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫికా అనే వెబ్సైట్లో మెలోని, ఆమె సోదరి అరియానా, ఇటాలియన్ ప్రతిపక్ష నాయకురాలు ఎల్లీ ష్లీన్ మార్ఫింగ్ ఫోటోలను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా, పబ్లిక్ సోర్సెస్ నుండి అనుమతి లేకుండా తీసిన ఈ చిత్రాలు, మహిళలను లైంగికంగా వేధించేందుకు ఉపయోగిస్తున్నారు.

