హైదరాబాద్‌లోని ఆదివారం సాయంత్రం పలుచోట్ల ఒక్కసారిగా వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, బహదూర్‌పల్లి, సూరారం, షాపూర్‌నగర్, జీడిమెట్ల, బాలానగర్, జగద్గిరిగుట్ట, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, సుచిత్రలో వానపడింది. అమీర్‌పేట, ఎర్రగడ్డ, కృష్ణానగర్, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడింది. వర్షంతో ఒక్కసారిగా వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

