హైదరాబాద్‌లోని కీలక రహదారులకు ప్రముఖ వ్యక్తులు, సంస్థల పేర్లు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవుటర్ రింగ్ రోడ్డు వద్ద రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచే వెళ్లే ప్రధాన రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలని తుది నిర్ణయం కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాయనుంది.

