లెబనాన్ ప్రభుత్వం తన దేశంలో హిజ్బుల్లా సైనిక కార్యకలాపాలను ముగించాలని తీసుకున్న నిర్ణయాన్ని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా స్వాగతించారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ఇది ఒక కీలక అడుగు అని ఆయన అభివర్ణించారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్తో చర్చలు జరిపిన అనంతరం, కోస్టా సోషల్ మీడియా వేదికగా పలు కీలక అంశాలను వెల్లడించారు.

