హర్మూజ్‌లో భారత్‌లోని గుజరాత్‌కు వస్తున్న వాణిజ్య నౌక సహా రెండు నౌకలను ఐఆర్జీసీ నేవీ స్వాధీనం చేసుకుంది. తాజాగా, ఆ నౌకలను ఛేజ్ చేసిన పట్టుకున్న వీడియోను ఇరాన్ అధికారిక టెలివిజన్ ప్రసారం చేసింది. మాస్క్‌లు ధరించిన కమాండోలు రెండు నౌకలను వెంబడించి, ఎలా స్వాధీనం చేసుకున్నదీ చూపించే వీడియోను బయటపెట్టింది. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించేలా ఈ ఛేజింగ్ సాగడం గమనార్హం. రెండు నౌకలు తమ హెచ్చరికలను పట్టించుకోలేదని, నిబంధనలను ఉల్లంఘించాయని ఇరాన్ ఆరోపించింది. నావిగేషన్ వ్యవస్థలను ఏమార్చి ప్రయాణించేందుకు ప్రయత్నించాయని ఆరోపించింది.

