అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం షుగర్ ల్యాండ్ నగరంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం ప్రాంగణంలో ఇటీవలే 90 అడుగుల ఎత్తైన భారీ హనుమాన్ విగ్రహంను ప్రతిష్ఠించారు. టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “టెక్సాస్‌లో ఒక నకిలీ హిందూ దేవుడి నకిలీ విగ్రహాన్ని మనం ఎందుకు అనుమతిస్తున్నాం? మనది ఒక క్రైస్తవ దేశం” అని ఆయన పేర్కొన్నారు. మరో పోస్టులో బైబిల్‌లోని వాక్యాలను ఉటంకిస్తూ, విగ్రహారాధనను వ్యతిరేకించారు.

