ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో శాసనసభ స్పీకర్ నిర్ణయంపై తాము స్పందించబోమని..ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కోర్టు ద్వారా తేల్చుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన రెబల్ అభ్యర్థులతో కలిపి దాదాపు 66 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ లోపాయికారీ ఒప్పందంతో కూటమిగా పోటీ చేసినప్పటికీ, ప్రజలు వారిని తిరస్కరించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 33 శాతం స్థానాలకే ఆ కూటమి పరిమితమైందని గణాంకాలతో సహా వివరించారు.

