పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, ఎల్పీజీ సంక్షోభం దేశంలోని పలు రంగాలపై ప్రభావం చూపుతున్నది. పరిశ్రమలకు అంతరాయం కలిగిస్తున్నది. దీనికి తోడు వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ వెళ్లేందుకు ఆదివారం ఉదయం వేలాది మంది ప్రయాణికులు సూరత్‌లోని ఉధ్నా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో భారీ జనసమూహాన్ని నియంత్రించేందుకు రైల్వే పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడటంతో గందరగోళానికి దారితీసింది

