సైన్యం సూచనతో నేపాల్ ప్రధాని కే పీ శర్మ ఓలి ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కొంచెం సేపటి క్రితమే ఆయన తన రాజీనామా సమర్పించారు. గత వారం నుంచి నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఆంక్షలు విధించడంతో యువతలో కోపం కట్టలు తెంచుకుంది. దీనికి ప్రతిగా జరిగిన ప్రదర్శనలు ఖాఠ్మాండు, లాలిత్‌పూర్‌లో హింసాత్మకంగా మారాయి. పోలీసులు, సైన్యం చేతిలో 20 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

