బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు బయల్దేరారు. కేటీఆర్ వెంట వెళ్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.కేటీఆర్ వెంట హరీశ్‌రావు జూబ్లీహిల్స్ పీఎస్‌కు వెళ్లారు. వారు బయటకు వెళ్లకుండా ఉండేందుకు గేట్లను మూసివేశారు. పోలీసుల చర్యపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా చొరబడుతున్నారని మండిపడ్డారు.

