ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ తాగిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బీసీసీఐ అతడిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతోపాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను రియాన్ పరాగ్ ఖాతాలో జోడించింది. రియాన్ తన తప్పును అంగీకరించినట్లు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

