తెలంగాణ రాజకీయాల్లో జాగృతి పార్టీ తన అడుగులను మరింత స్పష్టంగా వేస్తోంది. హైదరాబాద్లోని తన నివాసంలో జాగృతి అధ్యక్షురాలు కవిత ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో సుమారు 20 నుంచి 30 స్థానాల్లో జాగృతి అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. జాగృతి పార్టీ సింహం గుర్తుపై పోటీ చేసే అవకాశాలపై అంతర్గతంగా కసరత్తు చేస్తుండగా, అదే సమయంలో పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సింహం గుర్తును వైరల్ చేస్తున్నారు.

