తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కామారెడ్డిలోని ఓ గ్రామంలో మాత్రం ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. జిల్లాలోని రామారెడ్డి మండలం చిన్న గోకుల్ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమకు సమాచారం ఇవ్వకుండా పెద్ద గోకుల్ తండా వాసులు సర్పంచ్‌ను ఏకగ్రీవం చేసుకున్నారని గ్రామస్తులు నిరసనకు దిగారు. పెద్ద గోకుల్ తండా వాసిని వేలం పాట ద్వారా ఏకగ్రీవం చేసుకున్నారని చిన్న గోకుల్ తండా వాసులు ఆరోపిస్తున్నారు. కు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయలని వారు డిమాండ్ చేస్తున్నారు.

