బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ గాయపడ్డారు. ఆయన లేటెస్ట్ మూవీ ‘కింగ్’ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. ఓ యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా స్టంట్ చేస్తుండగా ఆయనకు గాయాలైనట్లు సమాచారం. అత్యవసర చికిత్స నిమిత్తం ఆయనను అమెరికాకు తరలించారని తెలుస్తోంది. ఈ గాయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కంగారు పడాల్సింది ఏమి లేదని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గతంలో కండరాల సమస్యతో ఇబ్బంది పడ్డ షారూఖ్ ఖాన్ అప్పుడు చికిత్స తీసుకున్నారు.

