హైదరాబాద్ స్కైరూట్ ఏరోస్పేస్ వేదికగా దేశపు తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయాణం మొదలు కానుంది. ఇందులో భాగంగా మ్యాక్స్-క్యూ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు హాజరయ్యారు. శ్రీహరి కోటకు పంపనున్న రాకెట్ విక్రమ్-1ను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ప్రీ ఫ్లైట్ పరీక్షలన్నింటినీ పూర్తి చేసుకొని తదుపరి ప్రయోగం కోసం.. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ కు ఇది చేరుకోనుంది.

