ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సభాపతి అధ్యక్షతన కాసేపట్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో, రాబోయే రోజుల అసెంబ్లీ కార్యక్రమాలు, చర్చల వ్యవధి, బిల్లుల ప్రవేశపెట్టే సమయాలపై బీఏసీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. .దీని తర్వాత ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.

