కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు రోజులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నిన్న శాసనసభలో కాంగ్రెస్ పార్టీ తన ద్రోహాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కట్టుకథలను, రేవంత్ రెడ్డి పిట్ట కథలను చెప్పే ప్రయత్నం చేశారు. పూర్తిగా అబద్ధాలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని, మోసాన్ని సరిదిద్ది తెలంగాణకు శాశ్వత నీటి హక్కులు పొందే విధంగా ప్రాజెక్టులు నిర్మించి ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది’ అని చెప్పారు.

