లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ‘ఓట్ల దొంగతనం’ ప్రచారంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీతో ఈసీ కుమ్మక్కు అయిందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.ఓట్ చోరీ అనే బదులు అందుకు సరైన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. మహాదేవపురంలో ఓట్ల అవకతవకలు జరిగాయని రాహుల్ ఆరోపించగా.. ఈసీ ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఓట్ల దొంగతనం’ అనే పదం ఎన్నికల ప్రక్రియపై దాడి చేయడమేనని ఈసీ పేర్కొంది.

