ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం తొలగింపు చుట్టూ భారీగా ఉద్రిక్తత నెలకొంది నందిగామ గాంధీ సెంటర్ వద్ద ట్రాఫిక్‌కు అడ్డుగా ఉందని చెప్పుతూ
మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించారు. విగ్రహం తొలగింపును ఖండిస్తూ వైసీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా దేవినేని అవినాశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “అధికారులు కోర్టు చెప్పే వరకు విగ్రహాన్ని తొలగించబోమన్నారు. కానీ అర్ధరాత్రి దొంగల్లా తీసేశారు,” అని మండిపడ్డారు.

