శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు కేతు పూజా రుసుముల పెంపుపై తలెత్తిన వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. భక్తుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో పాలకమండలి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఇటీవల రాహు కేతు పూజా టికెట్ల ధరలను పెంచాలని తీసుకున్న నిర్ణయం పెను దుమారం రేపింది. ముఖ్యంగా సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే రూ.500 టికెట్‌ను రూ.750కి పెంచాలని, అలాగే రూ.5000 టికెట్‌ను రూ.6000కి చేయాలని భావించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

