బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. పార్టీ మార్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిశారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో చూపించి “ఇవ్వాళ వీళ్లను మీరు గుర్తుపట్టగలరా?” అని ఎద్దేవా చేశారు. “ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేమిటి?” అంటూ రాహుల్ గాంధీని నిలదీశారు.

