ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో పంకజ్ గుప్తాకు పొరుగు గ్రామానికి చెందిన పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ సంబంధాన్ని ముగించడానికి ఆ మహిళ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వీడియోలతో ఆమెను పంకజ్ బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో తన కుటుంబ సభ్యులతో కలిసి అతడ్ని హత్య చేసింది. మృతదేహాన్ని గుర్తించకుండా ఉండేందుకు ముఖంపై యాసిడ్ పోసి కాల్చివేసింది. యువకుడి హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు.

