వ్యాపారులకు, హోటల్ యజమానులకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మే 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ. 993 పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,071.5 కు చేరుకుంది. ముఖ్యంగా హోటళ్లు, క్యాంటీన్లలో భోజనం ధరలు పెరిగే అవకాశం ఉండటంతో సామాన్యుడి జేబుకు పరోక్షంగా చిల్లు పడనుంది.

