పిఠాపురంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ రచ్చ ఘటనపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు, ప్రోటోకాల్ అంశాలపై అంత సీరియస్‌గా స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పొరపాట్లు జరిగితే వాటిని పార్టీ అంతర్గత వేదికలపై లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప, రోడ్డు మీద రచ్చ చేయడం సరికాదని మందలించారు. వర్మకు తక్షణమే కౌన్సెలింగ్ ఇవ్వాలని, కూటమి పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూడాలని పల్లాను ఆదేశించినట్లు సమాచారం. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవనే సంకేతాన్ని కూడా పరోక్షంగా పంపారు.

