తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది. మొత్తం పది వార్డుల్లో 8 చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి. కవిత తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఏఐఎఫ్బీకి చెందిన సింహం గుర్తుపై కవిత మద్ధతుదారులు దాదాపు అన్ని స్థానాల నుంచి పోటీ చేశారు.

