loader

తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిషన్​ వేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గంలో సిట్ నివేదికపై చర్చ కొనసాగింది. అన్ని అంశాలు పక్కనపెట్టి మరీ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చించారు. విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జ్ షీట్​లో ఎందుకు మిస్ అయ్యాయనే దానిపై ప్రధానంగా చర్చ జరిగింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ద్వారా విచారణ బృందం ఏర్పాటు చేసి నిర్ణీత కాలపరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON