రోడ్డు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు సుమారు ఏడు కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో నడిచి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పచ్చెదొడ్డి గ్రామంలోని రోడ్డు పూర్తిగా పాడైంది. దీంతో బస్సు సర్వీసు నిలిచిపోయింది. టవీ జంతువుల దాడి గురించి వారు భయాందోళన చెందుతున్నారు.

