మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ‘చికిరి చికిరి’ చార్ట్‌బస్టర్‌గా నిలవగా, ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ ‘రై రై రారా’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 2న ఈ మాస్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది

