ఏపీలో దుర్మార్గపు పాలన నడుస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు సంప్రదాయానికి తెరతీశారని… తమ పార్టీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రేపు తాము అధికారంలోకి వస్తే తమ వాళ్లు తన మాట కూడా వినరని హెచ్చరించారు. అప్పుడు చంద్రబాబు, టీడీపీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటికైనా మేలుకోని, తప్పు తెలుసుకోని, తప్పుడు సంప్రదాయాన్ని సదిదిద్దుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు

