వైఎస్ జగన్ డిజిటల్ బుక్‌ను లాంఛ్ చేశారు. కూటమి పాలనలో ఇబ్బంది పడుతున్న వైసీపీ కార్యకర్తలు ఇందులో ఫిర్యాదు చేసేందుకు వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్‌ను తీసుకొచ్చారు. ఈ మేరకు https://digitalbook.weysrcp.com/ వెబ్‌సైట్‌ను లాంఛ్ చేశారు. వైసీపీ కార్యకర్తలతో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ఈ డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. ఈ వెబ్‌సైట్‌తో పాటు ఐవీఆర్ఎస్ కాల్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు.
040-49171718 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

