సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం మెడ భాగాన్ని ధ్వంసం చేసి ఒకవైపు వంచినట్లు గ్రామస్తులు గుర్తించారు. గాంధీ విగ్రహం ధ్వంసంపై సమాచారం అందుకున్న రాయపోల్ పోలీసులు బుధవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ధ్వంసమైన విగ్రహాన్ని పునరుద్ధరించారు. విగ్రహం ధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

