131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. వారు మహిళల పేరుతో రాజ్యాంగ విరుద్ధమైన ఎత్తుగడ వేసి.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించారని విమర్శించారు. అందుకే ఈ బిల్లును ‘ఇండియా’ గుర్తించి ఆపిందని పేర్కొన్నారు. రాజ్యాంగానికి వందనం అని చెబుతూ.. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు.

