సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల్లో ప్రధాని మోదీ రికార్డులు సృష్టిస్తున్నారు. యూట్యూబ్‌లో కీలక మైలురాయిని ఆయన దాటేశారు. యూట్యూబ్‌లో ప్రధాని మోదీ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసిన వారి సంఖ్య 3 కోట్లు దాటింది. అయితే ఈ ఫ్లాట్‌ఫామ్‌లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ప్రపంచ నేతగా మోదీ రికార్డు సృష్టించారు. గత వారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఘనత సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాధినేతల్లో అత్యధిక సంఖ్యలో యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఉన్న నేతగా ప్రధాని మోదీ నిలిచినట్లు తాజా ర్యాంకింగ్స్ చెబుతున్నాయి.

