టెక్ రంగంలో సంచలనాత్మక మార్పుగా యాపిల్ తన నాయకత్వ నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 15 సంవత్సరాలుగా సీఈవోగా కొనసాగుతున్న టిమ్ కుక్ తన పదవికి వీడ్కోలు పలుకుతుండగా, హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జాన్ టెర్నస్ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఇక కుక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు.

