టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఇన్నింగ్స్‌లో అత్యధిక రన్స్ చేసిన సంజూ శాంసన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఆ అవార్డు అందుకున్న తర్వాత సంజూ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనకు దక్కాల్సింది కాదన్నారు. భారత జట్టు విజయంలో బౌలర్ బుమ్రా కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. గెలుపు క్రెడిట్ బుమ్రాకే దక్కుతుందని, అతనో ప్రపంచ మేటి బౌలర్ అని, సెమీస్ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడని, ఈ అవార్డు వాస్తవానికి ఆయనకే దక్కాలని అన్నారు.

