మెక్సికో మోస్ట్ వాంటెండ్ డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మెంచో మిలిటరీ ఆపరేషన్లో హతమయ్యాడు. డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి తర్వాత మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగింది. అతడి అనుచరులు పలు ప్రాంతాల్లో వాహనాలను తగులబెట్టారు. రహదారులను దిగ్బంధించారు. ఈ అల్లర్ల నేపథ్యంలో భారత పౌరులకు ప్రభుత్వం ఒక అడ్వైజరీ జారీ చేసింది. మెక్సికోలని భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎల్ మెంచోకు చెందిన జాలిస్కో న్యూజనరేషన్ కార్టెల్ సంస్థ అమెరికాకు ప్రధాన డ్రగ్స్ అక్రమ రవాణాదారుగా నిలిచింది.

