కోల్‌కతాలో నిర్వహించిన ఈద్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేతలే అసలైన చొరబాటుదారులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ను టార్గెట్ చేసేవారు నరకానికి వెళ్తారని, మతం పేరుతో విభజన రాజకీయాలు చేసేవారిని ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు.ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వమే దేశంలో అతిపెద్ద చొరబాటుదారులని మమతా బెనర్జీ విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తూ, ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

