తెలంగాణ ప్రభుత్వం మెట్రోరైల్ ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ ను నియమించింది. ఎన్వీఎస్ రెడ్డి ఇప్పటికే రిటైర్ అయినందున ఆయనను సలహాదారుగా నియమించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నల్లమోతు వేణు గోపాల్ రెడ్డి 2007 నుంచి కొనసాగుతున్నారు. ఆ పదవిని ఏర్పాటు చేసినప్పటి నుండి ఆయనే ఉన్నారు. నిర్వహిస్తున్నారు. 1983 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ అధికారి అయిన ఆయన, మొత్తం 18 సంవత్సరాలకు పైగా ఈ పదవిలో ఉన్నారు .

