తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. సిట్ ఆదేశాల మేరకు విచారణకు హాజరైన హరీష్ రావుకు సిట్ అధికారులు.. ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని నెలల పాటు హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసినట్లు, హరీష్ రావు ఫోన్ ఎప్పుడు ట్యాప్ అయిందో.. ఆ తేదీలను పోలీసులు ఆయనకు ఇచ్చినట్లు తెలుస్తోంది. హరీష్ రావుతోపాటు ఆయన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు వెల్లడించారు.

